infobabai supporting blog in this blog we will tell you about general topics, burning topics, viral topics, important topics, and current affairs with detailed explanation

Breaking

Friday, May 28, 2021

సూర్యుడి వద్ద భూమి కన్ను.

పార్కర్ సోలార్ ప్రోబ్ 


సాధారణంగా సోలార్ అనే పదం వినగానే పెద్ద పెద్ద పెట్టెలు లాగా ఉన్న సోలార్ ప్యానల్స్ మనకు జ్ఞాపకం వస్తాయి. వాటిని మనం నిత్య జీవితంలో సౌరశక్తిని నిలువ చేసి, తర్వాత ఉపయోగించడానికి వినియోగిస్తాము. కానీ అవే అనుకుంటే మనం పొరబడినట్లే.


ఇక్కడ ప్రోబ్ అనగా వ్యోమనౌక అని అర్థం వస్తుంది .పార్కర్ సోలార్ అనునది ఒక ఆపరేషన్ వంటిది. ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని పలు దేశాల శాస్త్రజ్ఞులు అంతరిక్షం పై ఎన్నో పరిశోధనలు చేపట్టారు. కానీ సౌర కుటుంబానికి కేంద్రం అయిన సూర్యుడిపై జరిగిన అతితక్కువ పరిశోధనలలో ఈ పార్కర్ సోలార్ అనే వ్యోమనౌక ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఫలితాలను అందించింది .ఘన విజయాన్ని కూడా సొంతం చేసుకుంది.


ఇంతకు ఆ రాకెట్లను నాసా శాస్త్రవేత్తలు ఎప్పుడు అంతరిక్షంలోకి పంపారో తెలుసా ......!.ఎంతో కృషి ,శాస్త్రవేత్తల శ్రమ ,అనేక పరిశోధనల తదనానంతరం నాసా శాస్త్రవేత్తలు 2018, ఆగస్టు 13వ తేదీన విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు .ఆ రాకెట్టు సూర్యుడికి అతిచేరువగా వెళ్ళినది అలాగే మొట్ట మొదటి సారి భూమికి సమాచారం పంపిన రాకెట్టు గా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నాసా పంపిన ఈ రాకెట్టు సూర్యుడికి సంబంధించిన అనేక మిస్టరీ లను ఛేదించడానికి ఉపయోగపడుతుందని, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
* సూర్యుని ఉపరితలం కంటే కరోనా భాగం లో అత్యధిక ఉష్ణోగ్రత ఉండడానికి గల కారణాలను,
* సూర్యుని నుండి వెలువడే గాలులకు మూలాన్ని కనుక్కోవడానికి,
* నక్షత్రాలు ఎలా పుడతాయి, ఎలా పరిణమిస్తాయి అన్న అంశంపై మరింత అవగాహన పొందడానికి,
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం అన్వేషించటం కొరకు, నాసా ఈ రాకెట్ ను ప్రయోగించడం జరిగినది. సూర్యుడికి వీలైనంత దగ్గరగా పరిశీలించడం ద్వారా అక్కడ జరిగే కార్యకలాపాలను మరింత స్పష్టంగా గుర్తించడానికి, వాటి ప్రభావం భూమిపై ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, పాలపుంత లోని మరిన్ని నక్షత్రాలను అర్థం చేసుకోవడానికి , అవసరమైన విషయాలు క్లుప్తంగా తెలుస్తాయని నాసా శాస్త్రవేత్త తామస్ జుర్బుకెన్ తెలిపారు.
infobabai, solar probe


6000°c ఉష్ణోగ్రత కలిగిన సూర్యుని దగ్గరకు వెళ్లి ఆ రాకెట్టు విజయం సాధించడం అనునది చిన్న విషయం కాదు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది .అసలు ఈ రాకెట్టు ఎందుకు పంపారో తెలుసా.......! సాధారణంగా సూర్యుడిని రెండు భాగాలుగా విభజిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రత భాగాన్ని "కరోనా"అని అత్యల్ప ఉష్ణోగ్రత భాగాన్ని" ఫోటోస్పియర్ " అని అంటాము. సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళినప్పుడు ,ప్రోబ్ పంపించిన చిత్రాలను గమనించి శాస్త్రవేత్తలు ఎంతో ఆశ్చర్యానికి గురి అయ్యారు.1/1000 వంతు పరిమాణం ఉన్న ఆ దుమ్ము, సూర్యునికి దగ్గరిలోని ఏదేని గ్రహశకలాలు అంతటి ఉష్ణోగ్రతను తట్టుకోలేక కరిగిపోయి ఉండొచ్చని, అలా ఆ దుమ్ము సూర్యుడి పైన చేరి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అపోహ పడుతున్నారు.

సూర్యుడిపై పరిశోధనలకు సులభతరంగా ఉండడం కోసం నాసా శాస్త్రజ్ఞులు ఎంచుకున్న మార్గమే ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ .ఈ వ్యోమనౌకను సూర్యుని కొరకు అంతరిక్షంలో పంపినప్పటికీ ఇది శుక్రగ్రహం కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫోటోల ద్వారా తెలియజేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమితో పోలిస్తే శుక్రగ్రహం పైన వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందని ఈ సోలార్ ప్రోబ్ ద్వారా తెలిసింది. అలాగే శుక్రుడు పైన సహజమైన రేడియో సిగ్నల్స్ ను కనుగొంది .దాదాపు 30 సంవత్సరాల తర్వాత శుక్ర గ్రహం పైన రేడియో సిగ్నల్స్ కనుగొన్నట్లు నాసా తెలిపింది. అంతేకాక భూమి నుంచి ప్రయోగించిన అనేక రాకెట్లలో శుక్ర గ్రహ ఛాయల్లో కి ప్రవేశించిన మొదటి ఉపగ్రహం కూడా ఇదేనని పేర్కొంది.


2018లో ఈ సోలార్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపినప్పటికీ అది సూర్యుడిని చేరడానికి దాదాపు ఏడు సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అనగా సూర్యుడికి దగ్గరలో ఉన్న శుక్రగ్రహాన్ని 2021లో చేరగా ,సూర్యుడి ఉపరితలంను 2023-2024 లలో చేరుకోనుందని శాస్త్రజ్ఞుల అంచనా. శుక్ర గ్రహం పై పరిశోధనలు చేయడానికి ఇదివరకే అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగానే శుక్ర గ్రహం పై వాతావరణ పరిస్థితులను అన్వేషించడానికి 1978 నుండి 1992 వరకు నాసా అనేక ప్రయోగాలు చేపట్టింది .కానీ చివరగా 2018 లో పంపిన ఈ సోలార్ ప్రోబ్ ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని నిస్సందేహంగా చెప్పవచ్చును.

సౌర కుటుంబానికి కేంద్రమైన సూర్యునికి ,సూర్యుని చుట్టూ తిరిగే భూమికి, మధ్య గల సగటు దూరం "149.5 "మిలియన్ కిలోమీటర్లు. అదేవిధంగా సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది .అలాంటిది ఏదైనా వస్తువు భూమి నుండి సూర్యునికి చేరాలంటే ఎంతో వేగాన్ని కలిగి ఉండాలి. అలాగే అది సూర్యుని ఉష్ణోగ్రతకు కరిగిపోకుండా ఉండగలగాలి . అందుకనే మన నాసా శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమపడి ఎన్నో పరిశోధనలు చేసి పార్కర్ సోలార్ ప్రోబ్ రాకెట్ ను సరికొత్త టెక్నాలజీతో ఆవిష్కరించారు. ఇది గంటకు 7 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది .సూర్యునికి దగ్గరగా వెళ్ళిన మొదటి ఉపగ్రహం కావడంచేత నాసా శాస్త్రవేత్తల శ్రమ ఫలించిందని చెప్పవచ్చును.


పార్కర్ సోలార్ ప్రాబ్ అనునది ఒక రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ .ఇలా సూర్యుని దగ్గరకు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ గా జర్మన్ అమెరికన్ హీలియోస్ 2 అనే స్పేస్ క్రాఫ్ట్ 1976 లో రికార్డు సృష్టించింది. అయితే ఈ వ్యోమనౌక కేవలం 26.5 మిలియన్ మైళ్ళ దూరం మాత్రమే వెళ్ళగలిగింది .కానీ 2018లో నాసా పంపిన పార్కర్ సోలార్ రాకెట్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. నవంబర్ 2 నాటికే 15 మిలియన్ మైళ్ల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడిపై దాగి ఉన్న అంశాలను చేజిక్కించుకోవడం కోసం నాసా 1958 లోనే ప్రయత్నాలు ప్రారంభించింది .అయితే అది ఈ పార్కర్ సోలార్ రూపంలో నెరవేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు. మొట్టమొదటిసారిగా సూర్యుని సమీపంలోకి వెళ్ళిన ఈ వ్యోమనౌక కు ఖగోళ శాస్త్రవేత్త అయిన "యూజింగ్ పార్కర్ " యొక్క పేరు పెట్టడం ఎంతో విశేషమైనది.
infobabai, solar probe




పార్కర్ సోలార్ నింగిలోకి దూసుకెళ్లిన ఉన్న సమయంలో ఆయన అక్కడే ఉండి ప్రత్యక్షంగా వీక్షించారు .అప్పటికి ఆయన వయసు 91 సంవత్సరాలు పూర్తి కావడం జరిగినది .ఇలా సోలార్ ప్రాబ్ అనే ఒక వ్యోమనౌక సూర్యుడిని చేరడానికి, నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని వినియోగించారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సూత్రాన్ని భారతదేశపు రైతుల నుండి గ్రహించడం జరిగింది .మన దేశంలోని అత్యధిక రైతులు పంట పండుతున్న సమయంలో, పక్షుల నుండి తమ పంటను రక్షించుకోవడం కోసం ఒక చిన్న పరిమాణపు రాయి కి దారం కట్టి, దానిని అత్యంత వేగంగా విసురుతారు .ఎంత వేగంగా విసిరితే అది అంత ఎక్కువ దూరం వెళుతుంది. దాదాపుగా ఇలాంటి సూత్రాన్ని వినియోగించి శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ను ప్రయోగించడం జరిగింది.

ఏదేమైనప్పటికీ నాసా శాస్త్రవేత్తలు పరిశోధన దాదాపుగా ఫలించింది అని చెప్పవచ్చు. అలాగే ఆ సోలార్ ప్రాబ్ మరిన్ని రహస్యాలను ఛేదించాలని ఆశిద్దాం .ధన్యవాదములు.

infobabai

___________________________________________________________________________________
From infobabai team

M Sandeep(blogger)
T. Uma Maheswari (Content Writer).