సాధారణంగా మనం వారం తేది చూడాలంటే క్యాలెండర్ ను ఉపయోగిస్తాం. క్యాలెండర్ అంటే అందరికీ బాగా తెలిసిన వస్తువే. ప్రతి సంవత్సరం ఒక కొత్త క్యాలెండర్ వస్తుంది. అయితే ఈ విశ్వం యొక్క ఆవిర్భావం నుంచి నేటి వరకు మొత్తాన్ని ఒకే క్యాలెండర్లో కుదించడం సాధ్యం అవుతుందా? అలా చేస్తే ఆ క్యాలెండర్ ఎలా ఉంటుంది? దాన్ని ఏమని పిలుస్తారు? అసలు దాన్ని ఎవరు తయారు చేశారు?
ఇంకా అనేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అని వివిధ రకాలైనటువంటి థియరీ లను, అనేకమంది శాస్త్రవేత్తలు తయారు చేశారు. కానీ అత్యధికుల నమ్మేది బిగ్ బ్యాంగ్ థియరీ.
బిగ్బ్యాంగ్ వల్ల అనంత విశ్వం ఏర్పడింది. విశ్వం ఆవిర్భవించడానికి ఒక మహా విస్పోటనం కారణమైంది. ఆ మహా విస్ఫోటనంనే బిగ్ బ్యాంగ్ అంటారు. ప్రాథమిక మైనటువంటి సాంకేతిక సూత్రాలు, ఆకర్షణ బలాలు, ప్రాథమిక భౌతిక సూత్రాలు, మేటర్, ఐస్కాంత క్షేత్రాలు అన్ని ఇక్కడి నుండి ప్రారంభమయ్యాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన నేటికీ 13.8 బిలియన్ సంవత్సరాలు అవుతోంది.
ఈ 13.8 బిలియన్ సంవత్సరాల ను ఒకే ఒక సంవత్సరంలోకి కుదించి ఒక సక్రమమైన విధానంలో అమర్చడాన్ని కాస్మిక్ క్యాలెండర్ అంటారు. కాస్మిక్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ ను కార్ల్ సాగాన్ అనే శాస్త్రవేత్త వెలుగులోకి తీసుకొచ్చాడు.
ఈ కాస్మిక్ క్యాలెండర్ వల్ల విశ్వం యొక్క వివిధ పరిస్థితులు మరియు మార్పులు సులభంగా అవగతం చేసుకోవచ్చు. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం బిగ్బ్యాంగ్ జనవరి 1 ఉదయం 12 గంటలకు జరిగింది. బిగ్ బ్యాంగ్ తో ప్రారంభమయ్యి ఇప్పుడు మనం ఉన్న ఆఖరి క్షణం డిసెంబర్ 31 రాత్రి 12 తో ముగుస్తుంది అంటే ఇన్ని సంవత్సరాల కాలాన్ని కేవలం ఒక్క సంవత్సరంలోకి తీసుకురావడమే ఈ కాస్మిక్ క్యాలెండర్ యొక్క ఉద్దేశం. అంటే 13.8 బిలియన్ సంవత్సరాల ను 12 నెల లో కి మార్చడం.
కాస్మిక్ క్యాలెండర్ లో
1సెకండ్ = 437 సాధారణ సంవత్సరాలు
1గంట= 1.575 మిలియన్ సంవత్సరాలు
1 రోజు= 37.8 మిలియన్ సంవత్సరాలు
కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం......
జనవరి 1 ఉదయం 12:00.
సరిగ్గా ఈ సమయానికి ఒక మహావిస్ఫోటనం జరగడం వల్ల ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది. మేటర్ ఆస్టరాయిడ్, గ్రహశకలాలు, గ్రహాలు, భౌతిక సూత్రాలు ఆకర్షణ బలాలు, అన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. దీన్నే బిగ్ బ్యాంగ్ అంటారు.
జనవరి 22
కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 22 నుండి గెలాక్సీలు ఏర్పడడం ప్రారంభమైంది. ఈ గెలాక్సీల లో దుమ్ము ధూళి ఆస్ట్రాయిడ్ లో గ్రహాలు గ్రహశకలాలు అనేక నక్షత్రాలు ఉంటాయి ఇవన్నీ పరస్పర గురుత్వాకర్షణ బలంతో ఆకర్షించే బడుతూ ఉంటాయి. మనం ఉంటున్న గెలాక్సీ పేరు మిల్కీవే తెలుగులో పాలపుంత అంటారు. గెలాక్సీలు స్పైరల్ ఎలిప్టికల్ మరియు ఇర్రెగ్యులర్ అని మూడు విధాలుగా ఉంటాయి. వాటి ఆకారాన్ని బట్టి వాటి పేరు నిర్దేశించబడి ఉంటుంది. ఈ విశ్వంలో 2 ట్రిలియన్లకు పైగా గెలాక్సీలు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా.
ఇవి నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి.
మార్చి 16
మార్చి 16 రోజున మనం నివసిస్తున్న అటువంటి గెలాక్సీ అయినా పాలపుంత ఏర్పడడం జరిగింది. కానీ కేవలం పాలపుంత మాత్రం ఏర్పడింది అందులో సౌర కుటుంబం వివిధ గ్రహాల కూటములు మొదలైనవన్నీ సరైన క్రమంలో ఇంకా ఏర్పడలేదు.
మే 12
మీ 12 రోజున అప్పటికి ఏర్పడి ఉన్నటువంటి మిల్కీవే గెలాక్సి తన రూపాన్ని డిస్క్ షేప్ లోకి మార్చుకుంది. అప్పటికి విశ్వం ఆవిర్భావం జరిగి ఐదు వందల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి అయినా జీవం యొక్క అడుగు జాడ కూడా ఆనవాలు కూడా లేదు.
సెప్టెంబర్ 2
సెప్టెంబర్ 2న మన భూగ్రహం ఉన్నటువంటి సౌరకుటుంబం ఏర్పడడం జరిగింది అంటే సూర్యుడు ధూలి గ్రహశకలాలు ఆస్టరాయిడ్లు ఏర్పడడం జరిగింది.
సెప్టెంబర్ 6
ఈ రోజున మనం నివసిస్తూ ఉన్నటువంటి భూమి ఏర్పడింది. కానీ అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో లేదు. విపరీతమైన అటువంటి వేడి జీవనం ఉండడానికి ఏమాత్రం అనుకూలంగా అయినటువంటి పరిస్థితులు లేవు.
భూమి ఏర్పడే నాటికి దాదాపు తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి.
సెప్టెంబర్ 21
సెప్టెంబర్ 21న భూమి మీద మొట్టమొదటిగా ఏకకణజీవులు ఆవిర్భవించాయి అంటే జీవం యొక్క ప్రారంభ స్థాయి అన్నమాట.
అక్టోబర్ 29
భూమి మీద వాతావరణ పరిస్థితులు క్రమంగా జీవనానికి అనుకూలంగా రూపుదిద్దుకోవడం మొదలయ్యాయి. భూమి మీద వాతావరణంలో ప్రాణవాయువు ఏర్పడ సాగింది. అంటే భూమి మీద ఉన్నటువంటి విపరీతమైన ఉష్ణోగ్రత అదుపులోకి వచ్చింది. ఇవి భూమి మీద జీవం ఏర్పడేందుకు నాంది పలికాయి.
డిసెంబర్ 5
మొట్టమొదటిసారిగా భూమి మీద ఏకకణ జీవులు బహుకణ జీవులుగా పరిణితి చెందాయి. అంటే మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ యొక్క ఉనికి ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కంటికి కనిపించని స్థాయి జీవం.
డిసెంబర్ 7
డిసెంబర్ 7 నాటికి భూమి మీద సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు రూపుదిద్దుకున్నాయి. ఇవి ప్రాథమికంగా భూమ్మీద జీవించి నటు వంటి జీవులు.
డిసెంబర్ 17
డిసెంబర్ 17 నాటికి చేపలు వివిధ రకాలైనటువంటి నీటిలో నివసించే టువంటి జీవజాలం ఏర్పడింది. కానీ ఇంకా భూమి మీద ఎటువంటి జీవం కూడా ఏర్పడ లేదు అంతా కూడా నీటిలో రూపుదిద్దుకున్నటువంటి జీవం.
డిసెంబర్ 20 మరియు 21
ఈ సమయంలో భూమి మీద మొక్కలు, గడ్డి, చిన్న చిన్న జంతువులు మొదలైనటువంటి భూచర జీవులు ఏర్పడడం జరిగింది.
డిసెంబర్ 25
డిసెంబర్ 25 నాటికి మనం చరిత్రలో చదువుకున్న భారీ ఆకారాలు కలిగిన రాక్షసబల్లులు జీవించాయి. ఇవి చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని పొందాయి. జీవ పరిణామ క్రమ వాదన ప్రకారం ఒకానొక సమయంలో డైనోసార్లు పక్షుల రూపుదిద్దుకున్నాయి అన్న వాదన కూడా వినిపిస్తోంది.
డిసెంబర్ 27
ఈ సమయం నాటికి భూమిమీద పక్షులు రూపుదిద్దుకున్నాయి. భూమ్మీద జీవించిన భారీ ఆకారాలను డైనోసార్లు పక్షులు రూపుదిద్దుకోవడానికి జీవ పరిణామ క్రమం దోహదపడింది అన్న వాదనకు ఇది కూడా ఒక బలమైన ఆధారం చేకూర్చింది. ఎందుకంటే డిసెంబర్ 25 నాటికి డైనోసార్లు ఉంటే పక్షులు డిసెంబర్ 27 నాటికి ఏర్పడ్డాయి బహుశా డైనోసార్లు పక్షులు గా రూపుదిద్దుకుని ఉండవచ్చు అన్న వాదనను ఇది బలపరుస్తుంది.
డిసెంబర్ 30
ఈ సమయం భూమిమీద పెనుమార్పులు చోటు చేసుకున్నటువంటి సమయం. ఈ సమయంలో భూమిని ఒక భారీ ఉల్క ఢీ కొట్టింది. దీనివల్ల దాదాపు 70 శాతం జీవరాసులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ సమయంలోనే డైనోసార్లు కూడా అంతరించిపోయి ఉంటాయి అని మరొక వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఉల్క భూమిమీద పరిస్థితులను జీవజాలాన్ని దాదాపుగా మార్చివేసింది.
డిసెంబర్ 31 మధ్యాహ్నం
ఈ సమయం నుండే మానవ పరిణామ క్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అనేక జీవ జాలాలతో ఉన్న భూమి మొట్టమొదటిసారిగా మానవ పురోగతికి బీజం వేసుకుంది. హోమో సెపియన్స్ కు బీజం పడింది ఇక్కడే.
డిసెంబర్ 31 రాత్రి 11:52
ఇప్పుడు జీవిస్తున్న అటువంటి మనిషి యొక్క ఆకారానికి ఈ సమయంలో రూపం ఏర్పడింది. అంటే నీటి రూపం సంతరించుకున్న టువంటి మానవుడు ఏర్పడ్డాడు.
రాత్రి 11 గంటల 59 నిమిషాల 30 సెకన్లకు ఆదిమానవులు ఆదిమానవుడుగా పరిణామక్రమం చెందాడు.
ఆఖరి అర్థ సెకనులో గత రెండు వందల సంవత్సరాలలో జరిగినటువంటి విపరీతమైన అభివృద్ధి చోటు చేసుకుంది. కేవలం అర్థ సెకన్లు ఇంత అభివృద్ధి జరగడం అనేది ఎంత గమ్మత్తును కలిగించే విషయం.
మన దగ్గర ఉన్న ఫోన్లు కంప్యూటర్లు వాహనాలు రవాణా సౌకర్యాలు లగ్జరీ వస్తువులు అన్నీ కూడా ఆఖరి అర్థ సెకనులో సాధించిన అభివృద్ధి మాత్రమే.
కేవలం తక్కువ సమయంలోనే మనం ఎంతో అభివృద్ధిని చూశాం.
కాస్మిక్ క్యాలెండర్ విశ్వం యొక్క ఆవిర్భావం నుండి నేటి వరకు జరిగినటువంటి పరిస్థితులను కేవలం ఒక సంవత్సర కాలం యొక్క పట్టిక లో మనకు సులభంగా అర్థమయ్యే విధంగా చూపిస్తుంది.