infobabai supporting blog in this blog we will tell you about general topics, burning topics, viral topics, important topics, and current affairs with detailed explanation

Breaking

Monday, June 7, 2021

మానవుడు అంతరించడం సాధ్యమేనా...?

 మానవుడు అంతరించడం సాధ్యమేనా...?

అంతరిస్తున్న జంతువులు అని విన్నాం .అంతరిస్తున్న పక్షులు అని విన్నాం .ఆఖరికి అంతరిస్తున్న చెట్లు అని కూడా మన నిత్య జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాము. అలాంటిది కోట్ల సంఖ్యలో ఉన్న మానవజాతి  అంతరించడం జరుగుతుందా, అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే మానవుడు బాహ్యంగా  అంతరించనప్పటికి, అంతర్గతంగా అంతరించిపోతున్నాడు ,అని అనడానికి నేడు మనం చూస్తున్న సంఘటనలు నిదర్శనాలు .అతడి చర్యలే వాటికి కారణాలు. అసలు బాహ్యంగా అంతరించడం, అంతర్గతంగా అంతరించడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం .అంతకంటే ముందుగా అంతరించడం అనడానికి అర్థం తెలుసా....!

                    సాధారణంగా ఏదేని ఒకటి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అత్యధికము  అని,అలాగే ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటే అత్యల్ప ము అని చెప్పుకోవచ్చును.మరి అత్యల్ప ము కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమని చెప్పుకోవాలి. అలాంటప్పుడు మనం అంతరించడం అనే పదాన్ని వినియోగించవచ్చును. అలాగే ఇప్పుడు మనిషి యొక్క ఉనికి గురిండి , అతడి మనుగడ గురించి తెలుసుకుందాం. అంతరిక్షంలో ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ, కేవలం భూగ్రహం పైన మాత్రమే మానవుని ఉనికి ప్రారంభమైనది. అందుకు భిన్నమైన  వాతావరణ పరిస్థితులు అని చెప్పవచ్చును.

 

భూమి ఎలా ఏర్పడింది అనే దానిపై శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .సుమారు 500 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలైందని చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అనేక దశలలో మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని భూమి సంతరించుకుంది. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తరువాత సముద్రాలలో జీవం మొదలైంది .లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపాంతరం చెందాయి. అలాగే మానవుడు హోమినిడ్ కుటుంబానికి చెందిన వాడని, కోతి నుండి కాలక్రమేణ సంక్రమించాడని మన చరిత్ర చెబుతుంది.


ఈ భూమి మీద మీద కోట్లాది జంతువులు,  వృక్షజాలం,సూక్ష్మజీవులతో పాటుగా మనం అనగా మానవుడు కూడా నివసిస్తున్నాడు .ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్ష సంవత్సరాల క్రితం ఉద్భవించింది. అయితే ఈ మానవుడు నేరుగా మానవుని రూపంలో అవతరించలేదు. సుమారుగా 400 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలలో సేంద్రియ మరియు రసాయనిక పదార్థాల కలయిక వల్ల జీవం ఏర్పడింది .సేంద్రియ రసాయనిక పదార్థాల నుండి  ఏకకణజీవులు ,బహుకణ జీవులు ,వాటినుండి జలచరాలు , వాటి నుండి నాలుగు కాళ్ల జంతువులు వాటి నుండి స్థన్య జంతువులు ,వాటినుండి ప్రథమశ్రేణి జంతువులు ,వాటినుండి చివరగా మానవుడు ఉద్భవించాడు.


పూర్వకాలంలో లో మానవులు ఆహారాన్ని ఎలా సేకరించేవారో తెలుసా ....!.కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపఖండాలలో నివసించే ప్రజలను" ఆహార సేకరణ వేటగాళ్ళు" అని పిలిచేవారు. వారు ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వారిని అలా పిలిచేవారు .వారు అడుగుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను ,తినడానికి ఉపయోగపడే వేళ్లను, దుంపలను, కాయలను ,గింజలను ,ఆకులను, తేనెను, అడవులలో సహజంగా పెరిగే అటవీ ధాన్యాలను, సేకరించేవారు .ఆహారం కొరకు జంతువులను పక్షులను వేటాడే వారు .చేపలు పడుతూ, గుడ్లను సేకరించేవారు .వారు, వారి ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు,వాటి జీవన విధానం బాగా తెలిసి పెట్టుకునేవారు. వేటాడే సమయంలో ఎంతో అప్రమత్తతో ,చురుకుదనంతో ,ఏకాగ్రతతో ఉండేవారు .ఈ విషయాలన్నింటినీ వారు వారి పూర్వీకుల నుండి తెలుసుకునేవారు .వారు జంతు చర్మాలను ఆకులను దుస్తులుగా వాడేవారు.

 

ఆదిమానవులు చిన్నచిన్న సమూహాలు, గుంపులు గా ఉంటూ సంచార జీవుల వలె గుహలలో, చెట్ల నీడలలో , రాతి స్థావరాల లో నివసించే వారు. ఆదిమానవులు తర్వాతి కాలంలో ఎన్నో వాటిని అన్వేషించడం మొదలు పెట్టారు .అందులో భాగంగానే వారు నిప్పుని కనుగొన్నారు .నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానాన్ని ప్రవేశపెట్టారు. క్రూర మృగాలను తరిమివేయడానికి ,తమను తాము రక్షించుకోవడానికి ,తాము నివసించే గుహలలో వేడిని మరియు వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి ఆ నిప్పు వారికి ఎంతగానో ఉపయోగపడినది .కావున వారు నిప్పును పవిత్రంగా భావించేవారు .

 

తర్వాత కాలంలో వారు పనిముట్లను వినియోగించడం మొదలు పెట్టారు .

* జంతువుల చర్మం తీయడానికి,

*  ఆ చర్మం శుభ్రం చేయడానికి ,

* జంతువుల మాంసం ,ఎముకలు కోయడానికి, 

* భూమిలోనుండి ఆహారంగా ఉపయోగించే దుంపలను ,వేళ్లను తవ్వి తీయడానికి ,

మొదలైన కారణాలతో, వారు పనిముట్లను వినియోగించేవారు .

 కొద్దికాలం తరువాత వారు చిత్రకళను పెంపొందించుకున్నారు .వారు నివసించే గుహల గోడలపై, వారు వేటాడే సంఘటనలను చిత్రాల రూపంలో చిత్రీకరించారు. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వు కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు .చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు.

 

ఇలా సుదీర్ఘకాలం పాటు ఆదిమానవులు వేటగాళ్లు గా తమ జీవనం గడిపారు .అలా సుదీర్ఘ కాలం తరువాత కాలక్రమేణా ఆదిమానవులు ఆహార సేకరణ నుండి వ్యవసాయదారులుగా ,పశు పోషకాలుగా ,మార్పు చెందారు. ఈ మార్పులు మానవ జీవితంలో అభివృద్ధికి సూచికగా చెప్పవచ్చును .దాదాపుగా 12,000 వేల సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప గొప్ప మార్పులు సంభవించాయి .ఈ వాతావరణ మార్పుల వల్ల మొక్కలు, చెట్లు ,గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించింది .గడ్డి తినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు ,మేకలు ,జింకలు మొదలగు వాటి సంఖ్య క్రమంగా పెరిగినది. మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు .అలాగే విత్తనాల నుండి మొక్కలు ఉదయిస్తాయి అని గ్రహించారు.


భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధికి కారకం అని "ఎడ్విన్ కానన్" వ్యాఖ్యానించారు .ఆయన ఊహకు తగ్గట్టుగానే మానవుని అభివృద్ధి ప్రారంభమయ్యింది. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు. పచ్చి మాంసం ,దుంపలు తినడం నుండి వాటిని ఉడికించి తినే దశకు చేరుకున్నాడు. రుచులను గుర్తించడం ఆరంభించాడు. నిప్పు సాయంతో అనేక రకాలుగా ఆహారాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు .వివిధ రకాల వంటలను తయారు చేస్తూ వాటి రుచిని ఆస్వాదించడం లో సఫలీకృతుడు అయ్యాడు.


మానవుడు నదీ ప్రవాహాలను ,ఆనకట్టల ద్వారా అదుపు చేస్తూ నీటిని వ్యవసాయానికి, నిత్యావసరాలకు వినియోగించడం ప్రారంభించాడు. అనేక కొత్త వస్తువుల సృష్టికరణకు నాంది పలికాడు. నీటి నుండి అనేకరకాల పానీయాలను తయారు చేశాడు .రోజు రోజుకి అభివృద్ధి ఎంతగానో విస్తరించింది. కొత్త కొత్త నిర్మాణాలను ఆవిష్కరించాడు .నివసించడానికి గుహ లకు బదులుగా గృహాలను, ఆరాధించడానికి దేవతలు ఉండే మందిరాలను, ఒక దగ్గర నుండి మరొక దగ్గరకు ప్రయాణించడానికి రహదారులను ,అనేక రవాణా మార్గాలను ,దిగ్విజయంగా నిర్మించాడు. సముద్రాలను మత్స్య సంపద కోసం ,రవాణా కోసం ఉపయోగించడం ప్రారంభించాడు.


వస్తువుల ఎగుమతి ,దిగుమతులను ఆరంభించాడు. జాతీయ ,అంతర్జాతీయ రంగాలలో ప్రతిభను కనబరచడం మొదలుపెట్టాడు .క్రీడారంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం, అధికారం రంగం, విప్లవ తరంగం, మొదలైన అనేక రంగాలలో ప్రవేశించడానికి ముందడుగు వేశాడు. వ్యవసాయ రంగంలో అనేక మార్పులను ప్రవేశపెట్టాడు. మెల్ల మెల్లగా ప్రజలు ఒక కొత్త రకమైన జీవనానికి అలవాటు పడ్డారు .ప్రతి ఒక్కరికి వారి కుటుంబ పోషణ కోసం ఉపాధి, సంపాదన అనునవి తప్పని సరి అయినవి .కాలం గడిచే కొలదీ పరిపాలన విధానం అమలు అయినది .వివిధ ప్రదేశాలను విభజించి ,రాజులు సొంతం చేసుకుని, పరిపాలించేవారు .రాజు తన రాజ్యంలోని ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు .తర్వాతి కాలంలో లో రాజులు రాజకీయవేత్తలు గా రూపాంతరం చెందారు .వీరు ప్రజల చేత నియమింపబడిన వారు. ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు ప్రవేశ పెడతారు.


సరికొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగినది .దీని ద్వారా ప్రజల అనేక అవసరాలు తీర బడేవి. నిధులను సమపాళ్ళలో అందరికి సమానంగా కేటాయిస్తూ ,సులభతరమైన మానవుని మనుగడకు ప్రభుత్వం దోహదం చేస్తుంది. నవీన రాతియుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేశారు .సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలతో కూడిన నాగరికతలు అభివృద్ధి చెందాయి .ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు వర్ధిల్లాయి. మానవుడు అభివృద్ధిలో ఎంతగా అభివృద్ధి అంటే తాను నివసిస్తున్నది ఒక భూమి అనే గ్రహం పైన అని ,అంతరిక్షంలో అలాంటివి ఎన్నో ఉన్నాయని ,కనుక్కొనేంతగా అభివృద్ధి చెందాడు. 

 విశ్వం యొక్క రహస్యాలను ఎన్నింటినో చేధించాడు. అనేక పరిశోధనలలో సఫలీకృతం అయ్యాడు .ఆకాశంలో కూడా రవాణా మార్గాన్ని కనుగొన్నాడు .ఎగిరే వాహనాలను కనుగొన్నాడు. నీటి నుండి విద్యుత్ ను సంపాదించవచ్చని నిరూపించాడు. గ్రహాలపై పరిశోధన కొరకు వ్యోమనౌక లను ఉపయోగించాడు.


ఇలా రసాయనాల పరిశోధనలలో భాగంగా కృత్రిమమైన వాటిని ఆవిష్కరించాడు .అందులో ప్లాస్టిక్ ను ప్రథమమైనదిగా చెప్పుకోవచ్చును. రసాయన ఎరువులను సృష్టించాడు .వ్యవసాయం లోని పంటకాలం తగ్గించేలా, ఎక్కువ ఉత్పత్తిని అందించేలా ,సరికొత్త రసాయనాలను పుట్టించాడు. కృత్రిమ వస్త్రాలను నిత్యావసరాలకు ,వినియోగించే కృత్రిమ వస్తువులను ,లోహాలను ఇలా ఎన్నింటినో సృష్టించాడు. అనేక రకమైన పరిశ్రమలను వివిధ ఉత్పత్తుల కొరకు నిర్మించాడు. రేడియో మరియు విద్యుత్ తరంగాలను సృష్టించాడు .ఇవన్నీ మానవుని అవసరాల కోసం నిర్మించినప్పటికీ, అవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువ కావడం చేత, ఎవరు తీసిన గోతిలో వారే పడ్డట్లుగా తాను సృష్టించిన వాటివల్ల తానే చిక్కుల్లో పడ్డాడు.


మానవుడు సృష్టించిన కార్యకలాపాల వల్ల మానవుడికి అన్ని కోణాలలో ముప్పు పొంచి ఉంది. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించే వాడవుతాడు అని ఇంగ్లాండు కు చెందిన "థామస్ మాల్థస్ "వ్యాఖ్యానించారు. సృష్టించిన రసాయనాల వాడకం వలన మనుగడకు అవసరమైన వ్యవసాయోత్పత్తులలో అది కలుషితంగా మార్పు చెందింది .పరిశ్రమలలోని వ్యర్ధాలను ఘన రూపంలో నదులలో కి ,వాయు రూపంలో గాలిలోకి, విడిచి పెట్టడం వలన అటు నీరు, ఇటు వాతావరణం లోని ప్రాణవాయువు ,రెండూ కూడా కలుషితం అయిపోతున్నాయి. విద్యుత్ తరంగాలను అధికంగా వినియోగించడం వలన పక్షి జాతికి ముప్పు ఏర్పడింది .అడవులను ,కొన్ని కొండ ప్రాంతాలను వ్యవసాయం కొరకు, ఇండ్ల నిర్మాణాల కొరకు వినియోగించడం వలన జంతుజాతికి ఆవాసం కరువై మనుషుల ఆవాసాలకు రావడం, దాడులకు పాల్పడటం, వంటివి జరుగుతున్నాయి. తద్వారా జంతుజాతికి ప్రాణహాని ఏర్పడుతున్నది.

 

అలాగే పెరిగిన శాస్త్ర పరిజ్ఞానంతో అనేక పరిశోధనలు చేయడం వలన వాటివల్ల వచ్చే ఫలితాలు కూడా మానవుని మనుగడకు ముప్పు కలిగిస్తున్నాయి. అనేక రకమైన ప్రాణాంతక వ్యాధులు, మనుషులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అలాంటి వాటిలో మరింత హానికరమైనది గా నేడు మనం ఎదుర్కొంటున్న "కరోనా" వ్యాధిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు .ఈ వ్యాధి సమస్త జీవకోటిని భయాందోళనకు గురిచేస్తుంది .ఎంతో మంది ప్రాణాలు సొంతం చేసుకుంది. ఎందరికో కుటుంబ సభ్యులను ,కుటుంబ పెద్దలను దూరం చేసి, దిక్కులేనివారిని చేసేసింది. ఎందరో పిల్లలను అనాధలుగా మార్చేసింది .ఈ వ్యాధి తీవ్రత ఇలాగే కొనసాగితే మానవుని మనుగడ అంతరించిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ ప్రాణాంతకమైన వ్యాధిని ఎదుర్కోవడానికి ఒకపక్క ప్రభుత్వాలు ,మరోపక్క ప్రజలు, రక్షకభటులు, వైద్యులు ,ఎంతగానో పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా ప్రతి ఒక్కరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.


కావున ఇకనైనా వనరులను పొదుపుగా వాడుతూ, దుర్వినియోగం చేయకుండా  వాతావరణానికి, మిగిలిన జీవులకు ,వీలైనంత వరకు ముప్పు కలిగించకుండా, ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి  అత్యధిక చెట్లను పెంచుతూ, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుంటూ, మనుగడను కొనసాగిద్దామని ప్రతిజ్ఞ పూనుదాం. ధన్యవాదములు......!